VIDEO: తాటి ముంజలకు భలే గిరాకి

VIDEO: తాటి ముంజలకు భలే గిరాకి

MDK: జిల్లాలో తాటి ముంజలకు భారీ గిరాకీ ఏర్పడింది. ఎండలు మండుతుండటంతో బాటసారులు తమ వాహనాలు ఆపి ముంజల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పది ముంజల ధర రూ.100గా ఉంది. వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ఈ ముంజలను కొనేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. దీంతో రోడ్ల పక్కన విక్రయ కేంద్రాల వద్ద సందడి కనిపిస్తోంది.