'తాగు నీటి కోసం అల్లాడుతున్న రోగులు'

HYD: అంబర్ పేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నీటి సమస్యలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఓపీలో చికిత్స కోసం ఇక్కడకు రోజుకు 200 మంది దాకా వస్తుంటారు. అలాగే 10 మంది ఇన్ పేషెంట్లుగా ఉన్నారు. బోరు చెడిపోవడంతో ఈ సమస్య నెలకొంది. విచిత్రమేమంటే ఈ ఆస్పత్రికి నల్లా లేకపోవడం. నీటి సమస్యను త్వరలో పరిష్కరించాలని వారు తెలిపారు.