HYDలో బీజేపీ తిరంగా యాత్ర

HYDలో బీజేపీ తిరంగా యాత్ర

TG: HYDలోని అంబర్‌పేటలో బీజేపీ తిరంగా యాత్ర చేపట్టింది. ఈ యాత్రలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయం సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు. ఈ నెల 17న ట్యాంక్ బండ్ వద్ద తిరంగా ర్యాలీ చేస్తాం. సైన్యం మనోస్థైర్యాన్ని పెంచాలి. ఉగ్రవాదాన్ని పెకిలించి వేస్తాం' అని పేర్కొన్నారు.