దీపావళితో అందరికీ మంచి జరగాలి: ఎంపీ ఉదయ్

KKD: కాకినాడ జిల్లా ప్రజలకు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ.. ఒక వీడియో విడుదల చేశారు. ఒక మంచి ప్రభుత్వంలో వచ్చిన మొదటి దీపావళిలో మీ అందరికీ మంచి జరగాలని, పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. దేవుని ఆశీర్వాదం ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని ఆకాంక్షించారు.