యుద్ధం వేళ విమాన సర్వీసులు రద్దు
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల వేళ 44 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిరిండియా ప్రకటించింది. యూరప్, అమెరికా, కెనడాలోని వివిధ నగరాలను అనుసంధానించే విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే మధ్యప్రాచ్య దేశాలకు విమానాలను ఇండిగో, ఎయిరిండియా, ఆకాశ ఎయిర్, స్పెస్‌జెట్ తాత్కాలికంగా నిలిపివేశాయి. అలాగే రేపటి వరకు ఇరాన్ సహా 11 దేశాల గగనతలంపై ప్రయాణించవద్దని డీజీసీఏ సూచించింది.