అలర్ట్.. రేపు జిల్లాకు వర్ష సూచన..!
PPM: రేపు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పశ్చిమమధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.