ఆర్డీటీ కోసం పోరాటం: బీసీవై

ఆర్డీటీ కోసం పోరాటం: బీసీవై

ATP: ఆర్డీటీ సంస్థ మనుగడ కోసం తమ పార్టీ తరఫున పోరాడుతామని బీసీవై అధినేత రామచంద్రయాదవ్ ప్రకటించారు. అనంతపురం పర్యటనకు వచ్చిన ఆయన ఈ మేరకు ఆర్డీటీపై మాట్లాడారు. పేదలకు అండగా నిలిచే ఆర్డీటీ సేవలు నిరంతరం కొనసాగాలని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సంస్థను కాపాడుకోవాలని కోరారు. అలాగే నగరంలో ఎస్సీ జన సంఘం కార్యాలయంపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.