మహిళలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మద్దిపాటి
E.G: మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి విజయాలను సాధించాలని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన గోపాలపురంలో మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబన స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించే దిశగా కృషి చేస్తానని తెలియజేశారు. నియోజకవర్గంలో నా జీతం నుంచి రూ. 4 లక్షల వెచ్చించి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మహిళల ఉపాధి కల్పనకు కృషి చేస్తానన్నారు.