భారీగా పట్టుబడిన గుట్కా నిల్వలు

WGL: పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ విభాగానికి అందిన సమాచారం మేరకు మంగళవారం స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలోని కిరాణా షాప్‌లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు రూ. 2లక్షల 97వేల విలువగల ప్రభుత్వ నిషేధిత పోగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కిరాణా షాపు నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు.