'కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కుంజా రవి'
BDK: ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కుంజ రవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఒకే పార్టీని నమ్ముకుని చాలా ఏళ్లుగా కష్టపడ్డానని, సర్పంచ్ టిక్కెట్టు అడిగితే ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తను చేసిన మంచి పనికి విలువ లేదని డబ్బుకి విలువ ఇస్తున్నారని, తనకు ఇదొక గుణపాఠం అని తెలిపారు.