సుఖోయ్ క్రాష్.. ఆపరేషన్ సింధూర్‌ పైలట్‌ మృతి

సుఖోయ్ క్రాష్.. ఆపరేషన్ సింధూర్‌ పైలట్‌ మృతి

భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానం అసోంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన ఇద్దరు పైలట్లలో ఒకరైన లెఫ్టినెంట్ పూర్వేశ్ గతేడాది పాక్‌పై భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో వీరోచితంగా పోరాడారు. ఇతని స్వస్థలం మహారాష్ట్రలోని నాగ్‌పూర్. 10 రోజుల క్రితమే ఇంటికి వచ్చి వెళ్లాడంటూ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.