నేడు ఉచిత వైద్య పరీక్షలు

కృష్ణా: గుడ్లవల్లేరులోని లయన్స్ సేవా భవన్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేడు ఉచిత మధుమేహ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు లయన్స్ ఛైర్మన్ నిమ్మగడ్డ శశికళ తెలిపారు. శిబిరంలో రోగులను పరీక్షించి, వారికి 15 రోజులకు సరిపడా ఉచిత మందులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.