ధర్నా వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
JN: హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఈనెల 29 అవుట్ సోర్సింగ్ కార్మికులు ధర్నా నిర్వహించనున్నారు. ఈ నిరసనకు సంబంధించిన ధర్నా పోస్టర్లను ఇవాళ MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. స్టేట్ అవుట్ సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ నిరసనకు కార్మికులు మద్దతు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు మల్లిగారి రాజు పాల్గొన్నారు.