VIDEO: చెరువులో చేపల మృత్యువాత
SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని వెంగల్ చెరువులో నీళ్లు లేక చేపలు బుధవారం మృత్యువాత పడ్డాయి. మత్స్యకారులు కథనం ప్రకారం.. 2 రోజుల నుంచి ఎండలు ఎక్కువ కొట్టడంతో చెరువులో నీరు తగ్గడంతో చేపలు మృత్యువాత పడ్డాయని తెలిపారు. దాదాపు 90 శాతం చేపలు మృతి చెందినట్లు తెలిపారు. మిగిలిన చేపలను కట్ట లింగంపేట గ్రామంలోని గురునాథం చెరువులోకి తరలిస్తున్నట్లు మత్స్యకారులు తెలిపారు.