VIDEO: వైన్ షాప్ తీసివేయాలని విద్యార్థుల ధర్నా
మార్కాపురం పట్టణంలోని స్థానిక మార్కెట్ సెంటర్ దగ్గర ఉన్న వైన్ షాపును తీసివేయాలని విద్యార్థులు బుధవారం ధర్నా చేపట్టారు. బడికి, గుడికి దగ్గరగా ఉన్న వైన్ షాపును తక్షణమే తొలగించాలని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. తక్షణమే అధికారులు స్పందించి ఈ వైన్ షాపును తొలగించేలా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు.