మండల అభ్యుదయ రైతులకు సత్కారం

E.G: గత రెండు సీజన్లుగా నానో ఎరువుల వినియోగం ద్వారా మంచి ఫలితాలు సాధించినందుకు గాను సీతానగరం మండలం అభ్యుదయ రైతులను సోమవారం ఘనంగా సత్కరించారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ నూతన సాంకేతిక విధానంలో నానో ఎరువుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.