బాలిక ప్రసవం.. పోక్సో కేసు నమోదు

బాలిక ప్రసవం.. పోక్సో కేసు నమోదు

అన్నమయ్య: మదనపల్లెలో శివారులో ఓ బాలిక ఈ నెల 22న ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఆలస్యంగా బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి వివరాలు తెలియరాలేదు. బాలిక తల్లిదండ్రులను పోలీసులు ప్రశ్నించినప్పటికీ స్పష్టమైన సమాచారం లభించలేదు. బాలిక, శిశువు ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది.