పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం

పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం

AP: పాఠశాల విద్యాశాఖ 'భారత రాజ్యాంగం పిల్లల కోసం' అనే పుస్తకాన్ని తీసుకొచ్చింది. హక్కులు, విధులు, రాజ్యాంగం గొప్పతనం గురించి తెలిసేలా ఈ పుస్తకం రూపొందించారు. చిన్నచిన్న కథలతో రాజ్యాంగంలోని అంశాలను పిల్లలకు అర్థమయ్యేలా తయారు చేశారు. మంత్రి లోకేష్ దీనికి ముందుమాట రాశారు. ఇంగ్లిష్‌లో ముద్రించిన ఈ పుస్తకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందించనున్నారు.