VIDEO: బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న దిల్ రాజు

VIDEO: బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న దిల్ రాజు

NZB: మోపాల్ మండలం నర్సింగ్‌పల్లి ఇందూరు తిరుమల క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు 3వ రోజు మంగళవారం వైభవంగా సాగాయి. ఇందులో భాగంగా స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు భజనలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. ఈ వేడుకలో సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు పాల్గొన్నారు.