డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయండి: అదనపు కలెక్టర్
NRML: సీఎంఆర్ డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 32,200 టన్నుల సన్న వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసి జులై 27వ తేదీలోపు ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు.