'నెలలో 22 రోజులు పని కల్పించండి'

KMR: ఎన్నికల హామీల ప్రకారం కామారెడ్డి జిల్లాలోని బీడి కార్మికులకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీఐటీయూ నాయకుడు సురేష్ గోండా డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు జీవనభృతి, ఆరోగ్య కార్డులు జారీ చేయాలన్నారు. నెలలో 22 రోజులు పని కల్పించేలా బీడి కార్ఖాన యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని అన్నారు.