అక్రమ కట్టడాలపై రెవెన్యూ గట్టిచర్య
ASR: డుంబ్రిగూడ మండలంలోని అరకు వారపు సంతలో 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తూ గిరిజనేతరులు చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. గురువారం స్థలానికి చేరుకున్న రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్ బీపీఎం రాజు కట్టడాల పనులను వెంటనే ఆపివేశారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టానికి విరుద్ధంగా ఎలాంటి నిర్మాణాలు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.