'విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించాలి'

NRPT: పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్రతతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లో విద్యా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆహార పదార్థాలను తనిఖీ చేయాలని, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. డీఈవో గోవిందరాజు పాల్గొన్నారు.