'దివ్యాంగుల పింఛన్లను పునరుద్ధరించాలి'

KRNL: వెరిఫికేషన్ పేరుతో నిలిపేసిన దివ్యాంగుల పింఛన్‌లను మళ్లీ పునరుద్ధరించాలని ఇవాళ పెద్దకడబూరులోని మండల పరిషత్ కార్యాలయంలో సీపీఎం, సీపీఐ ఎంఎల్ ఆధ్వర్యంలో పరిపాలన అధికారి కౌసల్యకు వినతిపత్రం అందజేశారు. నాయకులు తిక్కన్న, పరమేష్, హనుమంతు, దేవదాసు మాట్లాడుతూ.. పెద్దకడబూరు మండలంలో మొత్తం 156 మంది దివ్యాంగుల పింఛన్‌లను నిలిపి వేయడం దారుణమన్నారు.