రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

JGL: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన మల్యాల మండలం గొర్రెగుండెం వద్ద చోటుచేసుకుంది. మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన నరేష్ కొడిమ్యాల మండలం దమ్మయ్య పేటకు వెళ్ళి మంగళవారం రాత్రి తిరిగి వస్తుండగా బైక్‌ అదుపుతప్పి కిందపడడంతో తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు.