మంచినీటి ట్యాంకును ప్రారంభించిన ఎమ్మెల్యే
VZM: తెర్లాం మండలం జగన్నాథవలస గ్రామం బీసీ కాలనీలో ప్రజలు గత కొంతకాలంగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన దృష్టికి రావడంతో వెంటనే తన సొంత నిధులతో మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేసి, త్రాగునీటి సదుపాయం కల్పించారు. ఈమేరకు ఆదివారం వారి చేతులు మీదుగా ప్రారంభించారు.