VIDEO: చిట్టీ మోసం.. రూ.8 కోట్ల స్కాం

GNTR: చిట్టీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ పేరుతో రూ.8 కోట్లకు పైగా వసూలు చేసి ఇద్దరు అన్నదమ్ములు పరారయ్యారని ఆరోపిస్తూ, ఆదివారం తెనాలి నాజరపేటలో బాధితులు ఆందోళనకు దిగారు. చావలి గ్రామానికి చెందిన మహిళలు నజరుపేటకు వచ్చి, భాస్కర్ అనే వ్యక్తి ఇంటిముందు నిరసన వ్యక్తం చేశారు. మధ్య తరగతి కుటుంబాల నమ్మకాన్ని వంచించారని, తమ డబ్బులు తిరిగివ్వాలని వేడుకున్నారు.