పాఠశాలను తనిఖీ చేసిన ITDA PO

ASR: మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ITDA PO సింహాచలం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. స్టోర్ రూంలో ఉన్న కూరగాయలు, నిత్యావసర సరుకులను పరిశీలించారు. ప్రతీ విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలనే ధ్యేయంతో పని చేయాలని టీచర్లను ఆదేశించారు. పాఠశాల పరిసరాల్లో దోమలు పెరగకుండా, శుభ్రంగా ఉంచాలని తెలిపారు.