'ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి'
ADB: ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని తాంసి MAO రవీందర్ సూచించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా మంగళవారం కప్పర్ల క్లస్టర్ పరిధిలోని పాలోడీ గ్రామంలో ఫార్మర్ కిట్లను పంపిణీ చేశారు. ప్రకృతి వ్యవసాయంతోనే అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శివప్రసాద్, సర్పంచ్ వెంకటమ్మా నాగరెడ్డి పాల్గొన్నారు.