వాహనదారులకు గమనిక.!

వాహనదారులకు గమనిక.!

NLG: నకిరేకల్ మండలం కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు అధికారులు కీలక సూచన చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర రూ.3,000 నుంచి రూ.3,075కి పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ పాస్‌తో ఏడాదికి 200 సార్లు ప్రయాణించవచ్చు. వాహనదారులు 'రాజమార్గయాత్ర' యాప్ లేదా NHAI వెబ్‌సైట్ ద్వారా తమ పాస్లను యాక్టివేట్ చేసుకోవాలని సూచించారు.