NRP అగ్రహారంలో పర్యటించిన డిప్యూటీ స్పీకర్
W.G: ఉండి మండలం NRP అగ్రహారంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు మంగళవారం పర్యటించారు. గ్రామంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు, సీసీ రోడ్డును ఆయన లాంఛనంగా ప్రారంభించారు.