ఆర్టీవో కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

NTR: నందిగామ ఆర్డీవో కార్యాలయంలో, 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కే.బాలకృష్ణ, వివిధ అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అందరితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం.. స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.