VIDEO: కురవి మండల వ్యాప్తంగా జోరుగా వర్షం
MHBD: జిల్లా కురవి మండల వ్యాప్తంగా జోరుగా వర్షం కురుస్తోంది. ముంథా తుఫాన్ ప్రభావంతో ఈరోజు తెల్లవారుజాము నుంచి మండలంలో జోరుగా వర్షం కురుస్తుండడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతున్నది. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.