శ్రీవారి సేవలో కమెడియన్ జోగి నాయుడు

TPT: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని కమెడియన్ జోగి నాయుడు దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనంతో శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.