రింతాడలో కూలే స్థితిలో విద్యుత్ స్తంభం

రింతాడలో కూలే స్థితిలో విద్యుత్ స్తంభం

ASR: జీకే వీధి మండలంలోని రింతాడ పంచాయతీ సచివాలయం-2 పరిధిలో కాకరపాడు గ్రామంలో విద్యుత్ స్తంభం కూలేందుకు సిద్ధంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. ఇనుప స్తంభం అడుగు భాగం పూర్తిగా శిథిలమైందన్నారు. గాలి వీస్తే కూలిపోయేలా ఉందని, దీంతో విద్యుత్ స్తంభం పక్కన ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. అధికారుల స్పందించి నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలంటున్నారు.