ఈనెల 15, 16న స్పాట్ అడ్మిషన్లు

ఈనెల 15, 16న స్పాట్ అడ్మిషన్లు

VKB: పరిగిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ సునీతా పద్మావతి శనివారం తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు సెప్టెంబర్ 15, 16వ తేదీల్లో ఉదయం 10 గంటలకు కావలసిన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.