మధిరలో వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభించిన MEO

మధిరలో వేసవి క్రీడా శిక్షణ శిబిరం  ప్రారంభించిన MEO

KMM: మధిర మండల కేంద్రంలో గల ఇండోర్ స్టేడియంలో గురువారం ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరంను మధిర మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మధిర మండలంలోని యువత ఈ ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.