జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి

వనపర్తి: పెబ్బేరు మండలంలోని రంగాపురం స్టేజి సమీపంలో గద్వాల నుంచి కొత్తకోటకు యూరియా సంచులతో వెళ్తున్న లారీని ఎదురుగా అతివేగంతో వస్తున్న కారు లారీని కుడి వైపు నుంచి ఢీకొట్టడంతో అదుపు తప్పి లారీ డివైడర్‌కు గుద్దుకుంది. బలంగా డివైడర్‌కు ఢీకొట్టడంతో లారీ బోల్తా పడి లారీలో ఉన్న మహబూబ్ అనే క్లీనర్ తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.