బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

సత్యసాయి: విద్యుత్ షాక్ వల్ల కొద్దిరోజుల క్రితం మృతి చెందిన హిందూపురం మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుడు రమేష్ కుటుంబాన్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదుకున్నారు. ఈ సందర్భంగా బాధితుడి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల నగదు ఆర్థిక సహాయం అందజేశారు. కష్టకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే ఉదారతపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.