శక్తి యాప్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

SKLM: టెక్కలి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో శక్తి యాప్‌పై పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. విద్యార్థులకు యాప్ ఉపయోగాలను, పనిచేయు విధానాన్ని, సాంకేతిక పరిజ్ఞానం, టోల్ ఫ్రీ నెంబర్లు వివరాలను తెలిపారు. ఫోక్సో చట్టం, ఆన్ లైన్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.