అడవి జంతువుల దాడిలో గొర్రెలు మృతి
MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో గుర్తుతెలియని జంతువుల దాడిలో సుమారు రూ. 5 లక్షలు విలువ చేసే 40 గొర్రెలు మృతి చెందాయి. పొనవేని రాజబాబు అనే వ్యక్తి ఇంటి ఆవరణలోని గొర్రెలపై ఒక్కసారిగా దాడి చేయడంతో మృత్యువాత పడ్డాయి. అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దాడికి పాల్పడింది పులా.. కుక్కల, తోడేళ్ళ అనే దానిపై ఆరా తీస్తున్నారు.