నూతన క్యాంటీన్‌ను ప్రారంభించిన ఎంపీ పార్థసారధి

సత్యసాయి: పెనుగొండ పట్టణంలో ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన నూతన క్యాంటీన్‌ను హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథి శుక్రవారం ప్రారంభించారు. పులగూరు శ్రీనివాసులు ఈ క్యాంటీన్‌ను ఏర్పాటు చేయగా.. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ క్యాంటీన్ ఉపాధ్యాయులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.