VIDEO: నూతన సర్పంచ్‌ని సన్మానించిన నాయకులు

VIDEO: నూతన సర్పంచ్‌ని సన్మానించిన నాయకులు

SRD: గుమ్మడిదల మండలం కానుకుంటలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్ప పెంటారెడ్డి ఘన విజయం సాధించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ రోడ్డును బాగు చేయడమే తన మొదటి పని అని తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకురావడమే లక్ష్యం అన్నారు.