కరెంట్ షాక్‌తో గేదె మృతి.. రైతు ఆవేదన
NLG: వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెంలో గేదె విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు గంట కృష్ణయ్య తన గేదెను మేతకు తీసుకెళ్లగా, పొలంలో తెగిపడి ఉన్న త్రీఫేస్ విద్యుత్ వైరు తగిలి అది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సుమారు రూ.60 వేల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతు కోరుతున్నారు.