పరవళ్ళు తొక్కుతున్న సగిలేరు వాగు
KDP: కాశినాయన మండలం, చెన్నవరం గ్రామం సమీపంలో సగిలేరు వాగు పరవాళ్ళు తొక్కుతూ ప్రవహించడంతో దాదాపు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం పడినప్పుడల్లా చెన్నవరం, పాపిరెడ్డి పల్లె, కొండ పేట, బాలరాజు పల్లె, బసనపల్లె వంటి పలు గ్రామాలకు ప్రజలు ప్రయాణించడానికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.