పాకిస్తాన్‌కు బిగ్ షాకిచ్చిన నేపాల్‌

పాకిస్తాన్‌కు బిగ్ షాకిచ్చిన నేపాల్‌

మహిళల అంధుల టీ20 ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. పాకిస్తాన్‌కు పసికూన నేపాల్ బిగ్ షాక్ ఇచ్చింది. కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 170/ 7 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన నేపాల్ 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సెమీస్‌కు అర్హత సాధించింది.