శివరాత్రి ఏర్పాటను పరిశీలించిన కలెక్టర్

శివరాత్రి ఏర్పాటను పరిశీలించిన కలెక్టర్

NLG: మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ పట్టణ సమీపంలోని పానగల్ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 25 నుంచి 27 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల విషయమై మంగళవారం ఆమె ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.