తీవ్ర నష్టాల్లో జిల్లా టమోటా రైతులు

CTR: చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది టమాటా రైతులకు తీవ్ర నష్టాలు తప్పేలా లేవు. పలు చోట్ల 15 కేజీల టమాటా బాక్స్ ధర రూ. 50 పలుకుతున్నట్లు రైతులు తెలిపారు. ఇందులో ట్రాన్స్ పోర్ట్, కమిషన్ ధర, లేబర్ ఛార్జీలు కలిపితే ఒక్కొక్క బాక్స్‌కు సరాసరి రూ. 30 నుంచి రూ. 35 వరకు ఖర్చవుతుందన్నారు. తమకు ఒక బాక్స్ మీద రూ.15 మాత్రమే మిగులుతుందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.