VIDEO: గుంతలతో ఉన్న రోడ్లతో ప్రజలు అవస్థలు’
VKB: కుల్కచర్ల మండలంలో రోడ్ల దుస్థితి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. కుల్కచర్ల నుంచి పరిగి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయమై అధ్వాన్నంగా మారింది. ఈ కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణించాలంటే భయంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతల్లో మాయమైన రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.