రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

MNCL: చెన్నూర్ MRR గార్డెన్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నూరి శ్రీనివాస్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తన బైక్ అదుపుతప్పి కింద పడటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రుడిని చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.